సత్యవేడు ప్రభుత్వ ఆస్ఫత్రిలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్ట్ లను త్వరలోనే భర్తీ చేస్తామనీ డిసిహెచ్ఎస్ డాక్టర్ సరళ తెలిపారు. బుధవారం సత్యవేడు ప్రభుత్వ ఆస్ఫత్రి ని ఆమె తనిఖీ చేశారు.
ఈ సంధర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రేడియో గ్రాఫర్, ఫార్మాసిస్ట్ ,స్టాప్ నర్స్ పోస్ట్ లను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. వైద్యుల పోస్ట్ ల విషయానికివస్తే ఎంబిబిఎస్ పూర్తిచేసి స్థానికంగా పనిచేస్తామని ముందుకు వచ్చే వారి వివరాలు తనకిస్తే వెంటనే వారిని నియమించడం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బంది సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
కొందరు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా అవి లేవు.. ఇవి లేవు.. అంటూ సాకులతో కాలంగడుపుతున్నారనీ, వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందడం లేదని, రాష్ట్రం మొత్తం ఒకే కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించడం వల్ల సమస్య లు వస్తున్నాయని అంబేద్కర్ ఆర్మీ కి చెందిన రాజా డిసిహెచ్ఎస్ దృష్టికి తీసుకుని వచ్చారు.
వీటిపై ఆమె ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ సభ్యులు గోవిందస్వామి, చిన్నబ్బ, మరియు వైద్యులు పాల్గోన్నారు.
.

Discussion about this post