తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో సావిత్రిబాయ్ పూలే వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.
కొత్తపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి కి లోని ఉపాధ్యాయురాళ్లు హేమలత, భారతి, షాకిరా, జయలక్ష్మి, హేమ కి ఘనంగా సన్మానం చేశారు.
చక్రాల ఉష మాట్లాడుతూ ఆడపిల్లల చదువుకోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషిచేసిన సామాజిక ఉద్యమకారిణి మొదటి ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి పూలే అన్నారు.
చిన్న వయస్సులో బాల్యవివాహం జరిగినా ఆమె ఉన్నతభావాలతో భర్త సహకారంతో చదువుకొని అందరికి చదువు చెబుతూ అందరికి ఆదర్శం అయ్యారన్నారు.
ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
.