సుప్రీం కోర్టు మీద అందరూ కలిసి ఎస్సీ వ్యతిరేక ముద్ర వేసేస్తారా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ వేధింపు నిరోధక చట్టం విషయంలో కొన్ని సవరణలకు పూనుకున్నందుకు.. అంతా కలిసి.. ఏ రేంజిలో సుప్రీం న్యాయస్థానాన్ని ఆటాడుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎస్సీ వర్గాల్లో అసంతృప్తి రేకెత్తే మరో కీలక తీర్పును సుప్రీం వెలువరించింది.
ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరికి పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలనే అంశం చాలా కాలంగా పెండింగులో ఉంది. దీనిపై పదోన్నతుల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సుప్రీం తీర్పు వెలువరించింది. కనీసం ఈ కేసును… ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదలాయించాలనే వినతిని కూడా తిరస్కరించింది. ప్రమోషన్ల విషయంలో.. ఇది చాలా కీలక నిర్ణయంగా చెప్పుకోవాలి.
దీంతో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చాలా అసంతృప్తి రేగే అవకాశం ఉంది. మొన్నటిదాకా ఎస్సీ చట్టానికి సంబంధించి.. దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పుడిక ఈ అంశంలోనూ అలాంటి పరిస్థితి రావొచ్చు.
.
Discussion about this post