శ్రీకాళహస్తిలో రథోత్సవం సందర్భంగా భక్తులకు పలువురు సేవలు అందించారు. (సూపర్ స్నేహితుల మిత్రబృందం) శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1982-83 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు అన్నదానం చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సుమారు 1,200మందికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, సభ్యులు షేక్ అబ్దుల్ జబ్బార్, యస్.మణి, పట్టెం సురేష్, యన్.ఎస్ రాఘవన్, పి.రవిచంద్ర, చిర్రి గోపాల్, షేక్ అక్బర్ బాషా, యన్.వెంకటేష్, రెడ్డిపల్లె ప్రపాద్, రాజేంద్రన్, రవి. యస్.రమణ, షేక్ జిలానీ బాషా, మోటుపాలెం శేఖర్, అత్తిరాల భాస్కర్, పవన్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.

నందమూరి యువసేన అధ్వర్యంలో రథోత్సవం సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి యువసేన అధ్యక్షులు చిట్టివేలు సుకుమార్ రాయల్, సభ్యులు అఖిల్, సూర్య, వంశీ, భార్గవ్, చందు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఇక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగ ఉమ, కార్యదర్శి శైలజ, క్లబ్ సభ్యులు వేణు, భార్గవమూర్తి, వెంకటముని, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ భాస్కర్, జూలుగంటి లక్ష్మి, డాక్టర్ నారాయణ, జనార్ధన్, రమేష్ బాబు, పీఎం చంద్ర, జనిత, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post