స్టార్ హీరో రెమ్యునరేషన్ రిస్ట్‌వాచ్!

212

సినిమా చేస్తే లాభాల్లో వాటాలు, ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు అడుగుతున్న రోజులు ఇవి. అలాంటిది.. రెండు దశాబ్దాల ముందే కావొచ్చు గాక.. ఒక స్టార్ హీరో, కేవలం రిస్ట్ వాచ్ రెమ్యునరేషన్ కోసం సినిమా చేశాడని తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కూడా దేశమంతటా సంచలనం సృష్టించిన ఒక అద్భుతమైన పీరియాడిక్ డ్రామా! సినిమా దర్శకుడేమో యావద్భారతదేశం గర్వించే నటుల్లో ఒకడు.. జీరో రెమ్యునరేషన్ కు సినిమా ఒప్పుకుని, కేవలం రిస్ట్ వాచ్ గిఫ్టుగా పుచ్చుకున్నదేమో బాలీవుడ్ స్టార్ హీరో…! ఇలాంటి అరుదైన సంగతికి కారణమైన సినిమా.. ‘హే రామ్’!

కమల్ హాసన్ చేసిన సంచలన చిత్రాల్లో హేరామ్ ఒకటి. స్వాంతంత్ర్య పోరాట నేపథ్యంలో తీసిన చిత్రం అది. దేశవిభజన నేపథ్యంలో హిందూ-ముస్లిం యువకుల మధ్య స్నేహబంధం, మానసిక ఘర్షణ.. అప్పట్లో చెలరేగిన అల్లర్లు మతాల ప్రస్తావన లేని బంధాలను కూడా ఎలా కలుషితం చేశాయి గాంధీ హత్యకు కుట్రలు ఎలా జరిగాయి? లాంటి ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రాణి ముఖర్జీ, వసుంధర దాస్ చిత్రంలో కమల్ సరసన నటించారు.

అయితే కమల్ స్నేహితుడు ఆలీ అంజద్ ఖాన్ గా షారూఖ్ ఖాన్ ఈ చిత్రంలో చేశారు. కమల్ లో పరివర్తన తెచ్చే కీలకమైన పాత్ర అది. హిందువుల దాడుల్లో తండ్రిని కోల్పోయినా.. శాంతి కోరుకునే పాత్ర. అంతటి అద్భుతమైన పాత్రలో నటించినందుకు అప్పటికే స్టార్ డమ్ హోదా ఉన్న షారూఖ్ ఖాన్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. మంచి సినిమాలో భాగంగా ఉంటే చాలని అనుకున్నారట. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు.

కాకపోతే.. కమల్ స్వయంగా తన రిస్ట్ వాచ్ ను షారూఖ్ ఖాన్ కు గిఫ్టుగా ఇచ్చాడుట. అంత పెద్ద స్టార్ కేవలం ఒక రిస్ట్ వాచి రెమ్యునరేషన్ కు అంత పెద్ద సినిమా చేయడం విశేషమే.

Facebook Comments