ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అంటే ఎలాంటి వారికైనా వెన్నులోంచి వణుకు వస్తుంది. ముఖ్యంగా తప్పు చేసేవారికి.. ఎందుకంటే ఎవడు ఎక్కడినుండి తమను ఫోన్ లో క్లిక్ మనిపిస్తున్నాడో… తెలిసిచావదు… తీరా తన వీడియో వైరల్ అయ్యాక అప్పుడు నాలిక్కరచుకోవడం తప్పుడు దారుల్లో వెళ్లే వాళ్ల పని అవుతోంది. అంటే సోషల్ మీడియా అనేది మంచి పదునైన కత్తి లాంటిది… దానితో పళ్లు కోయవచ్చు… గొంతులు కూడా కోయవచ్చు… అని చెప్పవచ్చు. తాజాగా ఏసీబీ వలకు దొరకని ఒక దొంగ చేపను సోషల్ మీడియా పట్టించి తన బలాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజెప్పింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ మ మృత్యుంజయరాజు తాడేపల్లి గూడెం బైపాస్ వద్ద యూనిఫాం లేకుండా సాధారణ దుస్తుల్లో నిల్చుని వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. అయినా డ్యూటీ చేయడానికి మసనైనప్పుడు యూనిఫాం వేసుకుని చేస్తే సరిపోయేది… అలాకాకుండా మన సార్ కు ఏదైనా ‘తైలం’ అవసరం అయిందేమో… మఫ్టీలోనే డ్యూటీలోకి దిగేశారు. తనిఖీ చేసి ఎంతవరకు తైలం అవసరమో అంత పిండుకుని తర్వాత వెళ్లిపోయుంటే బహుశా దొరికేవారు కాదేమో… అలాకాకుండా వాహనాలను ఆపి అందులో ఏం సరుకుంది… దాని విలువ ఎంత తదితర వివరాలను ఆరా తీసి విలువను బట్టి ‘తైలం’ పిండడం ప్రారంభించారు. ఇది అలా అలా ఎవరో చక్కగా తమ సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఇవీ చదవండి :
మిస్ ఇండియా సినిమా రివ్యూ
భక్తియుత సంగీతానికి ప్రతీక.. నాగరత్నమ్మ
పవన్ గొప్ప మానవతామూర్తి ఎందుకంటే?
ఈ వీడియోలో ఒక రైతు ధాన్యం రవాణా చేస్తున్నట్టు, దానికి తగిన పత్రాలను కూడా చూపించినా మన ఇనస్పెక్టర్ సాబ్ సదరు రైతు వద్దనుండి 200 రూపాయలు వసూలు చేశారట. మరో మూడు లారీలనుండి తలా ఐదు వందల చొప్పున వసూలు చేశారట. ఈ వీడియో చక్కగా మీడియాలో వైరల్ కావడంతో రవాణా శాఖ కమీషనర్ వెంటనే స్పందించి సదరు మృత్యుంజయ రాజుగారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారట. మొత్తానికి సోషల్ మీడియా అనేది ఇలా కూడా ఉపయోగపడుతుందని అందరికీ చక్కగా మరోసారి అర్థం అయ్యేవుంటుంది…
.