తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు.
హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 12వ తేదీ శుక్రవారం నవగ్రహ హోమం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
.