శ్రీసిటీ ఫౌండేషన్ వితరణగా శ్రీసిటీ పరిధిలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు 25 వేల రూపాయల విలువ కలిగిన లైబ్రరీ పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు.
పెద్దఈటిపాక్కం, పెద్దఈటిపాక్కం దళితవాడ, కొల్లడం, రాళ్లకుప్పం, గొల్లపాలెం పాఠశాలలకు ఒక్కో స్కూల్ కు వివిధ శీర్షికలతో కూడిన 70 నుంచి 80 పుస్తకాలను ఆయా ప్రధానోపాధ్యాయులకు అందచేశారు.
చిన్న వయస్సు నుంచే పిల్లలలో పఠనాసక్తిని పెంచడం, మొబైల్ ఫోన్లు, టీవీల వీక్షణకు బదులుగా పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడం ఈ పంపిణీ లక్ష్యంగా శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
గతంలోను శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా సుమారు 3 లక్షల రూపాయల విలువైన లైబ్రరీ పుస్తకాలను శ్రీసిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేశామన్నారు.
కాగా లైబ్రరీ పుస్తకాల వితరణ పట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీసిటీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు.
	    	
.
    	
		    
Discussion about this post