రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడి వర్కర్లు, మినీ హెల్పర్లు ఆక్రోశంతోకన్నెర్ర చేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ హెచ్చరించారు.
ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరుగింది.
ఈ సమావేశంలో ముందుగా ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు మృతి చెందిన 720 మంది రైతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
అనంతరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ తన తండ్రిని మించి అంగన్వాడీలకు న్యాయం చేస్తానని, తెలంగాణ రాష్ట్రం కన్నా రూ ఒక వెయ్యి అదనంగా జీతం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కనీస వేతనాలు ఇవ్వకపోగా కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అంగన్వాడి వర్కర్ల పై రాజకీయ వేధింపులకు పాల్పడుతూ, పనుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. కొందరు అధికారులయితే వర్కర్లను, హెల్పర్లను దొంగలుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారికి అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, లేనిపక్షంలో డిల్లీ లో రైతులు చేసిన తరహాలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ 2022 ఫిబ్రవరి 13న విజయవాడలో జరిగే ఏపీ అంగన్వాడీ ప్రగతిశీల వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రూ. 13,660 వేతనం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,500 ఇస్తోందని తెలిపారు.
ప్రతి నెల 5వ తేదీ లోగా జీతాలు చెల్లించాలని జీవో ఉన్నా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు జి.భారతి మాట్లాడు అంగన్వాడి వర్కర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవి అమలు కావడం లేదన్నారు. పని ఎక్కువ ఉన్నా.. కష్టానికి తగ్గ జీతం మాత్రం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనం అందని దయనీయ పరిస్థితి ఉందన్నారు.
ఇది మారాలని ఆమె చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ప్రియదర్శిని మాట్లాడుతూ మినీ అంగన్వాడి వర్కర్లను కూడా ప్రధాన అంగన్వాడీళ్లతో సమానంగా గుర్తించి సమస్యలను పరిష్కరించాలన్నారు. తక్షణం ప్రమోషన్లు కల్పించాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనేక యాప్ లతో అవస్థలు పడుతున్నామని శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు కనీస వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడి నాయకు రాళ్ళు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
.
Discussion about this post