తూర్పు ప్రాంతంలోని పలు మండలాలలో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయని, వంకలు వాగులు నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయని చెరువులు కాజ్ వే ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టి ఎటువంటి నష్టం కాకుండా చూడాలని జాయింట్ కలెక్టర్( ఆసరా) రాజశేఖర్ అన్నారు.
సోమవారం ఉదయం ఆయన నారాయణవనం, నిండ్ర,నగరి మండలాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించి మండలాల్లో చెరువుల పరిస్థితి గురించి, కాజ్ వేల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఉదృతంగా ప్రవహిస్తున్న వంకలు వాగులు కాజ్ వే ల వద్ద ప్రజలు ఎవరు దాటకుండా చూడాలని అవసరమైతే అందుకు పోలీస్ శాఖ సహాయం కూడా తీసుకోవాలని అన్నారు.
ఈ ఆదివారం నాడు భారీ ఎత్తున వర్షపాతం నమోదు అయిందని చెరువుల పరిస్థితిని వాలంటీర్ ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఉంటే గుర్తించి వారిని సహాయక శిబిరా లకు పంపాలని, వారికి నాణ్యమైన భోజనం అందించాలని చూడాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నారు.
.

Discussion about this post