సీనియర్ పాత్రికేయులు, శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వెంకట్రావు ఆకస్మిక మరణం బాధాకరమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి అన్నారు.
వెంకట్రావు అనారోగ్యంతో శనివారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం గంగలపూడికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఆదివారం గంగలపూడికి వెళ్లి వెంకట్రావు భౌతిక కాయాన్ని పరామర్శించి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
వెంకట్రావు సేవలను ఈ సందర్భంగా బియ్యపు మధు కొనియాడారు. వెంకట్రావు విధి నిర్వహణలలో ఎంతో ముక్కు సూటిగా వ్యవహరించేవారని… అందరితో కలుపుగోలుగా ఉంటూ… తన కంటే చిన్న వారైనా ఎంతో గౌరవించే వారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అంజూరు శ్రీనివాసులు, కొల్లూరు హరినాథ, సెన్నీరు కుప్పం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా వెంకట్రావు మృతికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆయన సంతాపసభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
.