రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీకి బుద్ధి చెబుదామని బీజేపీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ అన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని స్వామి రిలాక్స్ ప్యారడైజ్ లో సోమవారం బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ అధ్యక్షతన పట్టణ కమిటీ నిర్వహించారు.
ఈ సమావేశానికి కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ… వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు.
పన్నుల రూపంలో పేదలపై భారం మోపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దాడులు చేయించడం… తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారని ఆరోపించారు.
ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే భవిష్యత్తులో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారీ వ్యవస్థ, అవినీతి రాజ్యమేలుతున్నప్పటికీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటం బాధాకరమన్నారు.
రాబోయే రోజుల్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, సీనియర్ నాయకులు చిలకా రంగయ్య, శైలజ, సొట్ట సుకుమార్, గరికపాటి రమేష్ బాబు, కన్నా వెంకటేశ్వర్లు, చెంగల్ రాయల్ రెడ్డి, గోపాల్, వీరాస్వామి, ప్రజ్ఞశ్రీ, ఉమా సింగ్, పద్మజా వాణి, శివమ్మ ,ఇమ్మడిశెట్టి మోహన్, వాసు యాదవ్, వెంకటేష్ ఆచారి, అయ్యప్ప గౌడ్, బాల, హరి, సాయి, భరత్ నాయుడు, రవి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
.