తిరుపతి వాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయేలా.. గత ప్రభుత్వ కాలం నుంచి నిర్మాణంలోనే ఉన్న ఫ్లై ఓవర్ ప్రారంభం నెలలోగా సాధ్యమయ్యేనా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇంకా అనేక చోట్ల పనులు పెండింగ్ లోనే కనిపిస్తుండగా.. నవంబరులో శ్రీనివాస సేతును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడం విస్తుగొలుపుతోంది.
నెలలోగా.. శ్రీనివాససేతు ప్రారంభానికి తగినట్లుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టు సంస్థను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు.
తిరుపతి నగర ప్రజలు, యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం నవంబరు నెలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస సేతు (గరుడ వారధి) ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్ గిరీష, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనుల పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నుంచి కపిలతీర్థం వరకు వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయిందని చెప్పారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దీన్ని ప్రారంభించ డానికి చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి నుంచి కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన మొత్తం త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టిటిడి అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన పనులు నవంబర్ లోపు పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను చైర్మన్ ఆదేశించారు.
.

Discussion about this post