రెండు నెలల కిందట పవన్ కల్యాణ్ ఒక మాట చెప్పారు. పత్రికలన్నింటికీ అదే పతాక శీర్షిక అయింది గానీ.. కొంతమంది తేలిగ్గా తీసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ నోటినుంచి వెలువడ్డంతో.. చాలామంది సీరియస్‌గా పట్టించుకున్నారు.
పవన్ కల్యాణ్ తొలుత జమిలి ఎన్నికల మాటెత్తారు. ఆయన తర్వాత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా అదే మాట అన్నారు. కేంద్రంలోని పెద్దలు, సాక్షాత్తూ నరేంద్రమోడీ కూడా దేశానికి జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి సర్కారులోని సచివులు, సలహాదారులు, వందిమాగధులు మాత్రం.. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని వాక్రుచ్చారు. తాజాగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కూడా జమిలి ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏ రకంగా చూసినా.. 2024 వరకు ఎన్నికల కోసం ఆగవలసిన అవసరం లేదనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.
ఇదీ చదవండి జగనన్న చెవిలో కరోనా గుడ్‌బై చెప్పేసిందా?
అదే సమయంలో.. జనసేనాని పవన్ కల్యాణ్ కు ఢిల్లీ వర్గాల నుంచి భవిష్య రాజకీయ పరిణామాల గురించి ముందుగానే సంకేతాలు అందుతున్నాయా? అనే చర్చ కూడా బాగా నడుస్తోంది. పవన్ కల్యాణ్ కు సహజంగానే రాష్ట్ర బీజేపీ నాయకుల కంటె, కేంద్రంలోని పెద్దలతోనే అతి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు కూడా. రాష్ట్ర బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ అంటే ఖాతరు లేకుండా మాట్లాడుతున్న సమయంలో.. పవన్ ఢిల్లీ వెళ్లి.. అక్కడి పెద్దలతో భేటీ అయితన తర్వాత.. రాష్ట్ర బీజేపీ నాయకులందరి నోర్లకు బ్రేకులు పడ్డట్లుగా కనిపించింది.
Also Read these Articles : ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై బ్యాన్ ఉంటుందా? సాక్షాత్తూ విష్ణుమూర్తిని ప్రత్యక్షంగా సేవించే మాసం ఇది!
పవన్ కల్యాణ్ లేకుండా ఏపీ బీజేపీ మనుగడ అసాధ్యం అన్నది ప్రజల్లో ఉన్న మాట. ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇప్పటికీ సమసిపోలేదు. వారు అంతో ఇంతో పరువు నిలుపుకోగలిగే ఓట్లు మూటగట్టుకోవాలంటే.. పవన్ మద్దతు వారికి తప్పనిసరి.
చిన్న ఉదాహరణగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సంగతి చూస్తే గనుక.. ఇప్పటిదాకా బీజేపీ నాయకులు పలుమార్లు తిరుపతిలో మీటింగులు పెట్టుకుంటున్నారే గానీ.. ప్రజల్లోకి వెళ్లే ఏ కార్యక్రమమూ చేయలేదు. అదే పవన్ కల్యాణ్ నివర్ తుపాను బాధిత ప్రాంతాల రైతులను కన్నీళ్లు తుడవడానికి సాగించిన పర్యటనలో.. వైసీపీ వర్గాలు అడ్డుకుంటున్నప్పటికీ.. చాలా దూకుడుగా వెళ్లారు. రైతన్నలకు చేయవలసిన సాయం గురించి ప్రభుత్వానికి తన డిమాండ్లు వినిపించారు. దానికి ఫాలోఅప్ గా మళ్లీ దీక్షలు కూడా నిర్వహించారు. ఇలాంటి క్రియాశీల కార్యచరణ బీజేపీలో కొరవడింది.
ఇవన్నీ కలిపి చూసినప్పుడు.. ఎన్నికలు ముందుగానే రాబోతున్నాయనే సంకేతాలతో పవన్ కల్యాణ్ బాగానే యాక్టివేట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తన మాటల్లో ముందుగానే సంకేతాలు అందించారు. తన చేతల్లో మరింత చురుగ్గా కదులుతున్నారు. ఇతర రాజకీయ పక్షాలకు విజ్ఞత ఉంటే ఆ సంకేతాలను అందుకుని తాము కూడా చురుకుగా కదలాలి.. లేకుంటే నష్టపోతారు అనే వాదనలు కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి.
వైసీపీ కళ్లు మూసుకుని ఉందా..
ఒకవైపు దేశం మొత్తం జమిలి ఎన్నికల మాట వినిపిస్తోంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం ఎన్నికలు మరింత ఆలస్యం అవుతాయనే మాటలతో సన్నాయి నొక్కులు నొక్కుతోంది. 2024 లో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, మరింత ఆలస్యం అవుతాయని.. ఈ సంగతి తెలిస్తే.. తెలుగుదేశం నాయకుల గుండెలు పగులుతాయని.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరీ కామెడీగా ఉన్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంటే.. వైసీపీ.. జమిలి సంకేతాలను అర్థం చేసుకోకుండా కళ్లు మూసుకుని వ్యవహరిస్తోందని పలువురు అంటున్నారు.
.