తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై దాడి చేయడం బాధాకరమని ఆ పార్టీ నేతలు అన్నారు. నారా లోకేష్ పై జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని పెండ్లిమండపం వద్ద టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఓ వివాహితపై దుండుగలు గ్యాంగ్ రేప్ కు పాల్పడి.. హత్య చేయడంతో అక్కడకు నారా లోకేష్ వెళ్లారన్నారు. ఇది ఓర్వలేక నారా లోకేష్ పై అధికార పార్టీకి చెందిన గూండాలు రాళ్ల దాడి చేశారన్నారు.
జగన్ పాలనలో అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా నేరంగా పరిగణిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
లోకేష్ పై రాళ్ల దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయకుమార్, చెంచయ్య నాయుడు, గుమ్మడిపూడి దశరథాచారి, రెడ్డివారి గురవారెడ్డి, చక్రాల ఉష, ప్రకాశ్ నాయుడు, ప్రసాద్ నాయుడు, జిలానీ బాషా, షాకీరాలీ, అస్మత్, మస్తాన్, గోపి, ఆర్ముగం, సంపత్ కుమార్, మిన్నల రవి, వెంకటేశ్వర చౌదరి, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
.