తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాల బాలికల అదృశ్య పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. గత కొంత కాలంగా అదృశ్యం అవుతున్న పిల్లల గురించి న్యాయవాది మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాపోలు భాస్కర్, హైకోర్టు లో పిల్ ధాఖలు చేశారు.
మిస్సింగ్ కేసులను పోలీసులు మూసివేశారని ఇట్టి కేసులను మళ్ళీ రీ ఓపెన్ చేయాలని పిటిషనర్కో ర్టుకు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ అధికారులను నియమించి విచారణ చేపట్టాలని కోరారు.
హాజపూర లో జరిగిన సంఘటన లాగే అదృశ్యమైన మైనర్ బాలికలపై ఇదే తరహా లో జరిగి ఉంటుందన్న పిటిషనర్ తన అభిప్రాయాన్ని కోర్టు ముందు ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ చేసిన 2 వేల కేసులను మళ్ళీ తిరిగి విచారణ జరిపించాలని పిటీషన్లో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ను కౌంటర్ ధాఖలు చేయాలని గతంలో హైకోర్టు అదేశం.. దాని పర్యవసానంగా ఆ పిటిషన్ పై మరోసారి హైకోర్టు గురువారం నాడు విచారణ చేపట్టనుంది.