సొంత పార్టీ గెలవాలంటే ఆ పార్టీ నుంచే అభ్యర్థిని బరిలో దింపి పోరాడాలి. కానీ తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీకి మాత్రం విన్నూత రీతిలో జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలే అంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థికి బలం లేక విపక్షాలను బలహీన పరచడానికి తనే డబ్బులు ఇచ్చి వేరే పార్టీ నుంచి అభ్యర్ధిని టీఆర్ఎస్ నిలబెడుతోందని కర్ణాకర్ణిగా వినపడుతోంది. ఈ స్టోరీ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలంటే తప్పక ఈ కథనం చదవండి.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ పోటీలో అధికార పార్టీ తెరాస మొదలు విపక్షాలు జర్నలిస్ట్‌లు, పాఠాలు చెప్పే టీచర్ల వరకు పోటీలో ఉన్నారు. అయితే ఎవరూ ప్రధాన పోటీ అనేది ఇప్పుడు ఇక్కడ ప్రధానం అంశం.
ఇప్పటికే తెరాస నుండి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖరారు అయ్యారు. అయితే ఇంకా కాంగ్రెస్, బీజేపీ, తెజస నుండి అభ్యర్థులు ఖారారు కాలేదు. మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ నుండి రాణిరుద్రమదేవి, వామపక్షాల తరఫున సీనియర్ జర్నలిస్ట్ జయసారధి రెడ్డితో పాటు పలువురు జర్నలిస్ట్‌లు, టీచర్లు పోటీలో ఉన్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణలో వీస్తున్న వ్యతిరేక పవనాలతో అధికార పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి పల్లాకు ఓటమి భయం పట్టుకుంది. అసలే దుబ్బాక విజయంతో జోరు మీద ఉన్న భాజపా చివరి క్షణంలో ఫలితం మారేలా ప్రయత్నం చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తెజస నుంచి పోటీకి ఆ పార్టీ అధినేత కోదండరాం బరిలోకి దిగితే ఖచ్చితంగా తెరాస ఓటమి చెందుతుందనే భయం వారిలో ఎక్కువగా ఉంది. అందులోనూ తెజస కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతోంది. ఒకవేళ తెజస తరఫున ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తే మాత్రం భారీ మెజారిటీతో కోదండరాం విజయం మాత్రం పక్కా అనే అంతా అనుకుంటున్నారు.
మరోవైపు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఎర్రజెండా ప్రభావం ఎక్కువ. ఆ పార్టీలకు ఉన్న ఆదరణే ఇప్పుడు తెరాసకు ఆశా కిరణంగా కనిపిస్తోందని సమచారాం. యువత ఓట్లు, మరోవైపు వామపక్షాల ఓట్లు చీల్చడానికి తెరాస ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యుహంలో భాగంగా ఓ సీనియర్ జర్నలిస్ట్‌ని రంగంలోకి దింపారని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఇటీవల అసెంబ్లీలో కలిసిన మీడియా మిత్రులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్యే కూడా జర్నలిస్ట్ సంఘాల నుంచి వచ్చిన ఎమ్మెల్యే అని మరో ప్రచారం మీడియా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు వామపక్షాల ఓట్లు చీల్చితే కోదండరాంని దెబ్బకొట్టేలా యువతను ఆకర్షించి ఓట్లు రాబాట్టాలనే ఆలోచనలో ఉంది తెరాస. ఏదీ ఏమైనా డబ్బులు ఇచ్చి ఇతర పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టి- వారి పుణ్యమాని తాము గెలవాలనే ఆలోచనలో ఉన్న తెరాస ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.
వామపక్ష పార్టీలకు భయపడుతున్న పల్లా…
తెలంగాణ ఉద్యమం లో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని చెప్పిన తెరాస ఆ దిశగా అడుగులు వేయలేదు… ఇటీవల వచ్చిన సర్వేలు అధికార పార్టీ కి వ్యతిరేకంగా ఉండడంతో పల్లా…. దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి వేరే పార్టీ నుండి అభ్యర్థిని దింపారు అని తెలుస్తోంది.
.

Discussion about this post