తిరుపతి వేద విశ్వవిద్యాలయ వైఖానస ఆగమ విద్వాన్, డీన్, శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ప్రయాణిస్తున్న కారు, ఆగి ఉన్న లారీని, బలంగా ఢీ కొనడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు.
వీరి సతీమణిని హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. డ్రైవర్ కూడా మృతిచెందారు.
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కోల్ కత్తా -చెన్నై జాతీయ రహదారిపై తిరుపతి నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడం తో ముగ్గురూ మృతి చెందారు.
ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు, యజమాని శ్రీనివాస చారి(58) మృతి చెందగా, వెనుక వైపు కూర్చొని ఉన్న.ఆయన భార్య రాజ్యలక్ష్మి (55 ) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.
మృతుడు శ్రీనివాసా చారి తిరుపతి వేది క్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఒంగోలులో జరిగే అయ్యప్ప స్వామి పూజకు వస్తూండగా జరిగిన ఈ దుర్ఘటన లో భార్య భర్తలతో పాటు డ్రైవర్ మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
.
Discussion about this post