రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా సామాన్య భక్తులను క్యూ లైన్లలో అరగంట కూడా ఆపలేదని ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు చెప్పారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ముక్కంటి ఆలయ పరిపాలన భవనంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి రాక సందర్భంగా భక్తులను గంటల కొలదీ క్యూలైన్లలో ఆపేశారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
సీసీ పుటేజీ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా మీడియా ప్రచారం చేయొద్దని ఆయన హితవు పలికారు. శ్రీకాళహస్తి దేవస్థానం లో సీసీ ఫుటేజ్ గమనించామని.. కొందరి లావాదేవీలు గమనించామని వారిపై త్వరలోనే శ్రీకాళహస్తి డీఎస్పీతో చర్చించి వారిపై కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
ఎవరి పై కేసులు నమోదు చేస్తారో అన్న దానిపై ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.
ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు జయశ్యాం, సాధన మున్నా రాయల్, సునీత, సుమతి వైసీపీ నేత నరసింహులు (నంద) తదితరులు పాల్గొన్నారు.
.