• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, August 18, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చంద్రబాబు- పవన్ కల్యాణ్ తేడా ఏంటి?

జగన్మోహన్ రెడ్డి పాలన దుర్మార్గంగా ఉందని అంటున్న ఇద్దరు ప్రధాన నాయకులు.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్.. మరి తమ తమ పార్టీల మీద వారు పెడుతున్న శ్రద్ధలో ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న తేడా ఏంటి?

admin by admin
March 16, 2021
0
చంద్రబాబు- పవన్ కల్యాణ్ తేడా ఏంటి?

పోస్టుమార్టం 1 :

చంద్రబాబు- పవన్ కల్యాణ్ తేడా ఏంటి?

జగన్మోహన్ రెడ్డి పాలన దుర్మార్గంగా ఉందని అంటున్న ఇద్దరు ప్రధాన నాయకులు.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్.. మరి తమ తమ పార్టీల మీద వారు పెడుతున్న శ్రద్ధలో ఈ ఇద్దరు నాయకుల మధ్య ఉన్న తేడా ఏంటి?

మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఎరగనంత అసమానమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాల గురించి ఎవరి దృష్టికోణంలోంచి వారు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. తమ సంక్షేమపథకాలకు ప్రజలు పట్టం కట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ అంటుంది. బెదిరింపులు సాధించిన విజయం అని తెలుగుదేశం- జనసేన అంటాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రతిపక్షాలుగా- కీలకమైన ఎన్నికల సమయంలో వారు పార్టీ మీద, రాజకీయ వ్యవహారాల మీద ఎలాంటి శ్రద్ధ చూపించారు.. అనేది చాలా కీలకమైన చర్చ. ఆ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడులో ఉన్న శ్రద్ధ, కమిట్మెంట్ లో పవన్ కల్యాణ్ కు వందో వంతు కూడా లేదేమో అనిపిస్తుంది.

పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగాయి. కానీ మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆలసించినా పర్లేదు గానీ.. మునిసిపల్ ఎన్నికల్లో పార్టీలు గట్టిగానే దృష్టిసారించాల్సిన పరిస్థితి. ఎందుకంటే గెలుపోటములు.. పార్టీ శ్రేణుల నైతికస్థైర్యం మీద, భవిష్యత్ ఆశల మీద ప్రభావం చూపిస్తాయి.

చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలను చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. ఓటమికి ఆయన చెబుతున్న కారణాలన్నీ పక్కన పెడితే.. ఆయన తాను ఎన్నికల ప్రచార పర్వంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. నిజానికి అధికార పార్టీ తరఫున.. జగన్ కాలు కదపలేదు. బాధ్యత మొత్తం మంత్రుల భుజాల మీద పెట్టారు. వారికి ఆ మాత్రం సరిపోతుంది. పైగా తమ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే నమ్మకం ఉంది. ఇతర పార్టీల నామినేషన్లు పడకుండానే అడ్డుకున్నారనే ఆరోపణలూ ఉండనే ఉన్నాయి. అయినా సరే.. ఎన్నిక జరుగుతున్న ప్రతిచోటా.. తెలుగుదేశం పార్టీ పెట్టిన శ్రద్ధ ఎక్కువ. ఆయన కార్పొరేషన్లలో స్వయంగా ప్రచారం చేశారు. అదే సమయంలో నారా లోకేష్ కూడా మునిసిపాలిటీల్లో కూడా ముమ్మరంగా తిరిగి ప్రచారం నిర్వహించారు.

పోల్చిచూసినప్పుడు..  జనసేన అధినేతగా ఈ పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలపై పవన్ కల్యాణ్ పెట్టిన శ్రద్ధ ఏమాత్రం? నిజానికి ఎన్నికల సమయంలో ఆయన కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. రెండు షిఫ్టుల్లో రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి స్వయంగా వెళ్లే ఓపిక, వ్యవధి ఆయనకు లేవు. కేవలం షూటింగ్ లొకేషన్ స్పాట్ కు నాయకుల్లో కొందరిని పిలిపించుకుని మాట్లాడుతూ కాలం గడిపారు.

గెలుపు ధీమాతో జగన్ కాలు కదపకపోయినా.. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఒకవైపు ఊరూరా తిరుగుతూ కష్టపడుతోంటే.. పవన్ కల్యాణ్ ఈ ఎన్నికలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆయనకు రాజకీయాలు ఒక నాన్-సీరియస్ అంశం అని విమర్శించే వారికి మరింత ఊతం ఇచ్చేలా ఈ వ్యవహారం ఉండడం విశేషం.

Tags: chandrababu naidujanasenamunicipal pollspawan kalyantelugudesamysrcp victory
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply