తెలంగాణలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో తమ అస్తిత్వాన్నిచాటుకోవాలని తెగ ఉత్సాహపడ్డారు. ఇక్కడినుంచి కొందరు నాయకులు తాడేపల్లి వెళ్లి జగన్ ను కలిసి, పోటీ గురించి చర్చించబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఫైనల్‌గా పోటీలో వైసీపీ ఉండడం లేదని తెలుస్తోంది.
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉంది వైకాపా పార్టీ. ఏపీలో అధికారంలో ఉన్నా… ఇక్కడ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. రాబోయే శాసనసభ ఎన్నికలకు పోటీ చేయడానికి కసరత్తులు చేస్తున్నామని చెబుతున్నా.. అసలు కథ వేరే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సీఎం హోదాలో మరణించారు. ఆయనకు అటు ఏపీ ప్రాంతంలో ఉన్నట్టుగానే.. తెలంగాణ ప్రాంతంలో కూడా మంచి ప్రజాదరణ ఉంది.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా? పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
రాష్ట్రం విడిపోయినా రాజన్న అభిమానులు మాత్రం ఇంకా కలిసికట్టుగానే ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో భాజపా పట్టు బిగిస్తుడడం తెరాసను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరి ఇప్పుడు జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో వైకాపా పోటీ చేస్తే.. ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ కోరిక మేరకు వైకాపా పోటీ నుంచి తప్పుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆ నేపథ్యంలో వైసీపీ పోటీలో లేకపోయినట్లయితే.. జగన్ ను అభిమానించే వాళ్లంతా గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకే ఓటు వేస్తారనడంలో సందేహం లేదు. వైసీపీ బరిలోకి రావడం వలన.. అధికార పార్టీకి ఆ ఓటు బ్యాంకు చీలిపోతుంది. ప్రస్తుత పరిణామాల్లో పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగవచ్చునని అనుకుంటున్న తరుణంలో అలాంటి ఓటు చీలికలు చేటు చేస్తాయని ఆలోచిస్తున్నారు.
అసలే ఇటీవల దుబ్బాక వచ్చిన ఫలితాలు తెరాస పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాబట్టి ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు తెరాస, వైకాపా మధ్య ఆ మేరకు రాజకీయ ఒప్పందం జరిగిదంటున్నారు.
.

Discussion about this post