ఇందుగలడందులేడని.. అని ప్రహ్లాదుడు వర్ణించినట్టు మహావిష్ణువు పలు ప్రాంతాల్లో వెలిశాడు. పాకిస్థాన్ లో కూడా మహావిష్ణువు వెలిశాడు. పూర్వకాలంలో పాకిస్థాన్ ను పరిపాలించిన రాజులు అక్కడ మహావిష్ణు దేవాలయాన్ని నిర్మించినట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అఖండ జంబూద్వీపంలో భాగమైన పాకిస్తాన్ లో ఇందుకు సంబందించిన ఆధారాలు కూడా వారి తవ్వకాల్లో బయటపడ్డాయి.
పాకిస్థాన్ లోని స్వాత్ జిల్లాలో 1300 ఏళ్ల నాటి పురాతన విష్ణుమూర్తి దేవాలయం బయటపడింది. పాకిస్థాన్, ఇటలీకి చెందిన పురాతత్వశాస్త్రవేత్తల సంయుక్త తవ్వకాల్లో ఈ దేవాలయం బయటపడింది. అప్పట్లో పాకిస్థాన్, కాబూల్, గాంధార ప్రాంతాలను పరిపాలించిన హిందుషాహీల కాలంలో ఈ ఆలయాన్ని నిర్ణించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఇక్కడ ఆలయమే కాకుండా సైనికుల శిక్షణకు సంబంధించిన ప్రాంతాలు, ఇంకా వాచ్ టవర్ కూడా ఆలయ సమీపంలో బయటపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకా ఆలయ సమీపంలో ఒక నీటి తటాకం కూడా బయటపడినట్టు తెలిపారు. ఆ కాలంలో ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలంటే ముందుగా స్నానం చేసి దైవర్శనానికి వెళ్లే ఆచారం ఉండి ఉంటుందని చరిత్రకారులు తెలిపారు.
నిజానికి హిందూ రాజులు పలుదేశాలలో తమ రాజ్యాన్ని స్థాపించారు అని అనేక చారిత్రక పరిశోధనల ద్వారా బయటపడుతోంది. కొన్ని దేశాలలో మన దేశంలోని గ్రామాల పేర్లను పోలిన ఊర్ల పేర్లు కూడా వినిపిస్తుండడం కద్దు. మొత్తానికి ఒకప్పుడు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ తదితర అనేక ప్రాంతాల్లో హిందూ రాజుల పాలన సాగుతుండేదనే వాదనకు ఇలాంటి ఆధారాలు బలం చేకూరుస్తాయేమో!
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి :
పరమశివుని అష్టమూర్తులు ఎవరో వివరాలు తెలుసా?
తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా?
పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ
పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా?
ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
.

Discussion about this post