హైదరాబాదు ఎంతో అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడ అత్యంత అధునాతనమై గన్స్, ఆయుధాలు లైసెన్సు ఉన్నవి, లైసెన్సు లేనివి కూడా పుష్లకంగా దొరుకుతాయి. ‘అతడు’ సినిమాలో ఒక డైలాగు కూడా ఉంది. ‘ఎవడ్రా మనం డెవలప్ కాలేదని చెప్పింది’ అంటూ ప్రకాష్ రాజ్ ఆధునాతన గన్స్ గురించి అంటాడు. కానీ తమాషా ఏంటంటే.. రాజధాని నగరంలో లైసెన్సు తీసుకున్న గన్స్ వేలల్లోనే ఉన్నాయని తెలిస్తే సామాన్యుడికి ఆశ్చర్యం కలుగుతుంది. బల్దియా ఎన్నికల సందర్భంగా.. పోలీసు ఆంక్షలతో లైసెన్సుడు వెపన్స్ ఉన్నవాళ్లు.. తాత్కాలికంగా వాటిని పోలీసు స్టేషన్లలో అప్పజెబుతున్నారు. ఆ రకంగా ఇప్పటికి స్టేషనకు చేరిన గన్స్ సంఖ్య 1500 పైనే నట! ఇంకా ఎన్ని వేల తుపాకులు అప్పజెబుతారో.. ఇవి కాకుండా.. లైసెన్సులేని గన్స్ వాడే ప్రముఖులు ఎన్ని వేల మంది ఉంటారో తెలియదు.
బల్దియా ఎన్నికల సందర్భంగా పోలీసు సన్నాహాలు, ఏర్పాట్ల గురించి కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బల్దియా ఎన్నికలపై గట్టి భద్రత ఏర్పాట్లు చేసామన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ఎన్నికలు నిర్వహించడం బాధ్యతగా పేర్కొన్నారు. డి అర్ సి కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్.సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ప్రివెన్షన్ పై ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
ఇప్పటి వరకు పట్టుబడిన హవాలా నగదు 9 కేసుల్లో నగదు అంతా ఇన్కమ్ టాక్స్ అధికారులు అప్పజెప్పినట్లు వివరించారు. ఆయుధాలు లైసెన్స్ కలిగిన వారు ఎన్నికల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సిందిగా పిలుపు ఇచ్చారు. ఇప్పటిదాకా నగరంలో వివిధ స్టేషన్ల పరిధిలో 15వందల లైసెన్స్ ఆయుధాలు ఆయ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసినట్లు కూడా చెప్పారు. సున్నితమైన, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసామన్నారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఉంటుందన్నారు. ఇప్పటికే అన్ని సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, విధులకు ఆటంకం కలిగించినా.. ఎలాంటి వారిమీద అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆదర్శిని ప్రత్యేక కథనాలను ఇక్కడ చదవండి click here
.

Discussion about this post