• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

భారతంలో ధర్మరాజు ప్రార్థించిన దుర్గాస్తుతి

admin by admin
October 13, 2024
0
భారతంలో ధర్మరాజు ప్రార్థించిన దుర్గాస్తుతి

దుర్గాదేవిని స్తుతించే స్తోత్రాలు మనకు అనేకం లభ్యం అవుతాయి. అయితే వ్యాసవిరచితమైన దుర్గాస్తుతి ఇది. వ్యాస విరచిత శ్రీమహాభారతంలో ఉంటుంది. నన్నయాదులు దీనిని తెలుగులో రాయలేదు. సంస్కృత మహాభారత గ్రంథంలో మాత్రమే లభిస్తుంది.

దుర్గాదేవిని భక్తకోటి ఆరాధించే విజయదశమి పర్వదినానికి పాండవులకు భారతంలో అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, విరటుడి కొలువు చేరడానికి అజ్ఞాత వాసానికి బయల్దేరే ముందు చిక్కని అడవిలోగల శమీవృక్షం తొర్రలో తమ ఆయుధాలు అన్నింటినీ దాచిఉంచుతారు. కాబట్టే దసరా పర్వదినానికి శమీవృక్షం (జమ్మిచెట్టు)కు అవినాభావ సంబంధం ఉంటుంది. పల్లెటూళ్లలో దసరానాడు జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. అడవుల్లోకి వెళ్లి, మంచి చేస్తుందని, జమ్మి ఆకును భక్తిగా ఇంటికి తెచ్చుకుంటారు. తమ మిత్రబంధువులకు కూడా జమ్మి ఆకులను ‘బంగారం’గా కానుకగా ఇవ్వడం కద్దు. 

శమీవృక్షం తరువాత చేయబోయే అజ్ఞాతవాసపు ఏడాది రోజుల్లో తాము పట్టుబడకుండా ఉండాలనేది అప్పటికి పాండవుల ఎదుట ఉన్న పెద్ద కష్టం. విరాటరాజ్యంలోకి ప్రవేశించే ముందు.. అదే దసరా పర్వదినం నాడు ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించి, తమను కాపాడాలని కోరుకుని, ఆ తరువాత రాజ్యప్రవేశం చేస్తారు. ఆ దుర్గా స్తుతి ఇది. ధర్మరాజు చేసిన ప్రార్థన.. వేడుకోలు..

 

యశోగర్భ సంభూతాం నారాయణ వరప్రియామ్
నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్

కంసనిద్రావణకరీమ్ అసురాణాం క్షయంకరీమ్
శిలాతటవినిక్షిప్తామ్ ఆకాశం ప్రతి గామినీమ్

వాసుదేవస్య భగినీం దివ్యమాల్యవిభూషితామ్
దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీమ్

యశోద గర్భంనుండి పుట్టినది, నారాయణునికి ప్రియమైనది, నందగోపుని వంశంలో జనించినది,  అందరికీ శుభములనిచ్చేది, వంశం వృద్ధి పొందించేది, కంసుని పారద్రోలినది, అసురులను నాశనం చేసినది, ఱాతిమీద కొట్టబడినా ఆకాశంలో పయనించినది, వాసుదేవుని సోదరి, దివ్యమైన పూలమాల దివ్యాంబరమూ ధరించినది, ఖడ్గమును, డాలునూ దాల్చినది ఆ దేవి.

 

భారావతరణే పుణ్యే యే స్మరంతి సదాశివమ్
తాన్ వై తారయసే పాపాత్ పంకే గామిన దుర్భలామ్

భారం తగ్గించే పుణ్యమయీ! సదా శుభాలనిచ్చే నీవు నిన్ను స్మరించిన వారిని బురదలోనుండి బలహీనమయిన ఆవును పైకి లాగినట్లు ఉద్ధరిస్తావు.

 

స్తోతుం ప్రచక్రమే భూయః వివిధైః స్తోత్రసంభవైః
ఆమంత్య్ర దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః

నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి
బాలార్కసదృశాకారే పూర్ణచంద్రనిభాననే

ధర్మరాజు తమ్ముళ్లతో సహా దుర్గాదర్శనాన్ని కోరుతూ దేవిని సంబోధిస్తూ అనేక స్తోత్రాలతో స్తుతించడం ప్రారంభించాడు. వరాలనొసగే నీకు నమస్కారం. నల్లని రూపుగలదానా! కుమారీ! బ్రహ్మచారిణీ! లేత సూర్యునివంటి శరీరకాంతి కలదానా! నిండు చంద్రునితో సమానమయిన ముఖం కలదానా!

 

చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణిపయోధరే
మయూరపింఛవలయే కేయూరాంగదధారిణి
భాసి దేవి యథా పద్మా నారాయణ పరిగ్రహః

స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం గగనేశ్వరీ
కృష్ణచ్ఛవిసమా కృష్ణా సంకర్షణ సమాననా

నాల్గుభుజాలు కల్గి నారాయణునితోనూ, నాల్గు ముఖాలు కలిగి బ్రహ్మతోనూ సమానురాలవు. పుష్టికల జఘనం, స్తనాలు కల్గినదానా! నెమలిపింఛాలు నీకు గాజులు,కేయూరాలు, అంగదాలూ ధరించిన దానవు. నారాయణుని భార్య లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్నావు. నీ రూపమూ, బ్రహ్మచర్యమూ స్వచ్ఛమైనవి. నీవు ఆకాశంలో చరింపగల దేవివి. కృష్ణునితో సమానమైన శరీరకాంతి నీకుంది. అందుకే నీకు కృష్ణ అని పేరు. కానీ బలరామునితో సమానమయిన స్వచ్ఛమైన ముఖకాంతి కూడా కలిగిన దానవి నీవు.

 

బిభ్రతీ విపులౌ బాహూ శక్రధ్వజ సముచ్ఛ్రయౌ
పాత్రీ చ పంకజీ ఘంటీ స్త్రీవిశుద్ధా చ యా భువి

పాశం ధనుర్మహాచక్రం వివిధాన్యాయుధాని చ
కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా

చంద్రవిస్పర్తినా దేవి ముఖేన త్వం విరాజసే
ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా

భుజంగభోగవాసేన శ్రోణిసూత్రేణ రాజతా
విభ్రాజసే చాబద్ధేన భోగేనేవేహ మందరః

వర, అభయ ముద్రలు దాల్చి ఎత్తైన నీ విశాల బాహువులు ఇంద్రధ్వజ సమానములై యుంటాయి. మూడవ చేతిలో పాత్ర, నాల్గవ చేతిలో పద్మమూ అయిదవ చేతిలో గంట ప్రకాశిస్తున్నాయి. ఆరవ చేతిలో పాశమూ, ఏడవ చేతిలో ధనుస్సు, ఎనిమిదవ చేతిలో మహాచక్రమూ ఇలా నానాప్రకార ఆయుధాలు కలిగి ఉన్నావు. భూమిమీద స్త్రీ యొక్క విశుద్ధ రూపం అంటే నీవే. నీ చెవులు కుండలాలతో నిండుగా అలంకరింపబడ్డాయి. చంద్రునితో పోటీపడే ముఖంతో విరాజిల్లుతుంటావు. చిత్ర రత్నాలు కల కిరీటంతో నీ కేశపాశం శోభిల్లుతోంది. పామువలె ఉన్న కటిసూత్రం (మొలత్రాడు) ధరించి వాసుకితో కూడిన మందరపర్వతంలా ఉంటావు.

 

ధ్వజేన శిఖిపింఛానామ్ ఉచ్ఛ్రితేన విరాజసే
కౌమారం వ్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా

నెమలిపింఛాలు ఎత్తి కట్టిన ధ్వజంతో విరాజిల్లుతావు. కౌమారం అనే బ్రహ్మచర్య వ్రత పాలనంతో స్వర్గాన్ని పవిత్రం చేశావు.

 

తేన త్వం స్తూయాసేదేవి త్రిదశైః పూజ్యసేపిచ
త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని
ప్రసన్నా మే సురశ్రేష్ఠే దయాం కురు శివా భవ

అందుకే దేవీ! నీవు దేవతలచేకూడ స్తుతింప బడుతున్నావు. పూజింపబడుతున్నావు. త్రిలోకాలనూ రక్షించటానికి మహిషాసుర సంహారం చేశావు. దేవతలలో శ్రేష్ఠురాలవు నీవు. నాకు ప్రసన్నురాలవై నామీద దయ చూపుము. నాకు శుభమిమ్ము.

 

జయా త్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా
మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రదమ్

నీవే జయవు, విజయవు. యుద్ధంలో జయమిచ్చే దానవు నీవే. నాకు కూడా విజయం ఇయ్యి. ఇపుడీ వరమియ్యి.

 

వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతమ్
కాళి కాళి మహాకాళి ఖడ్గఖట్వాంగధారిణి

కాళీ! మహాకాళీ! ఖడ్గమూ, ఖట్వాంగమూ (పైభాగాన కపాలం కల దండం) ధరించి పర్వత శ్రేష్ఠమైన వింధ్య పర్వతం శాశ్వత నివాసంగా చేసుకొన్నావు.

 

కృతానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణీ
భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే తు నరా భువి
న తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనతోపివా

నిన్ను అనుసరించేవారి కోరికలు తీరుస్తావు. నీవు కామసంచారిణివి, వరము లీయగలవు. తమ ఆపదల భారం తీరటానికి నిన్ను స్మరించేవారికీ, ఉదయమే నీకు నమస్కరించే వారికీ పుత్రవిషయంలో కాని, ధన విషయంలో కాని దుర్లభమేదీ లేదు.

 

దుర్గాత్ తారయసే దుర్గ తత్ త్వం దుర్గా స్మృతా జనైః
కాంతారేష్వవసన్నానాం మగ్నానాం చ మహార్ణవే

దస్యుభిర్వాం నిరుద్ధానాం త్వం గతిః పరమానృణామ్
జలప్రతరణే చైవ కాంతారేష్వటవీషు చ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః
త్వం కీర్తిః శ్రీః ధృతిః సిద్ధిః హ్రీః విద్యా సంతతిర్మతిః

సంధ్యా రాత్రిః ప్రభా నిద్రా జ్యోత్స్నా కాంతిః క్షమా దయా
నృణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయమ్

వ్యాధిం మృత్యుం భయం చైవ పూజితా నాశయిష్యసి
సోహం రాజ్యాత్ పరిభ్రష్టః శరణం త్వాం ప్రసన్నవాన్

భరింపరాని కష్టాలనుండి తరింపజేస్తావు నీవు. అందుకే ప్రజలు నిన్ను దుర్గ అంటారు. అడవుల్లో చిక్కుకొన్నవారికీ, సముద్రం దాటేవారికీ, దుర్గమ మార్గాలలో పయనించే వారికీ, క్రూరుల బారిన పడినవారికీ నీవే గతి. సముద్రాలు దాటాలన్నా, అడవులతిక్రమించాలన్నా నిన్ను స్మరించిన వారు కష్టాలపాలు కారు. నీవే కీర్తివి. శ్రీ, ధృతి, సిద్ధి, లజ్జ, విద్య, సంతానం, బుద్ధి సంధ్య, రాత్రి, తేజస్సు, నిద్ర, వెన్నెల, కాంతి, ఓర్పు, దయ మొదలైన రూపాలు నీవే. నిన్ను పూజించిన వారి బంధనం, మోహం, పుత్రశోకం, ధననాశం, రోగం, మృత్యువు, భయమూ తీరుస్తావు. అమ్మా! ఇపుడు నేను రాజ్యభ్రష్టుడనయ్యాను.నీ శరణు వేడుతున్నాను. 

 

ప్రణతశ్చ యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి
త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వ నః

దేవతలకు కూడా దేవివైన నీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నీవు పద్మపత్రాలవలె ప్రసన్నమైన కనులు కలదానవు. నన్ను రక్షించు. నీవు సత్యవు, మాకు సత్యవు (సత్పురుషులయందు సాధువు) కమ్ము. 

 

శరణం భవ మే దుర్గే శరణ్యే  భక్తవత్సలే
ఏవం స్తుతా హి సా దేవీ దర్శయామాస పాండవమ్
ఉపాగమ్య తు రాజానమ్ ఇదం వచనమబ్రవీత్

దుర్గా! నీవు శరణ్యురాలవు. భక్తులయందు వాత్సల్యం కలదానా! నాకు శరణమగుము‘ అని ధర్మరాజు స్తుతించాడు. 

Tags: dasara durga stutidharmarajudurga stutivirata rajyamదుర్గాస్తుతిదుర్గాస్తోత్రంధర్మరాజు దుర్గాస్తుతిమహాభారతంలో దుర్గాస్తుతివ్యాస విరచిత దుర్గాస్తుతి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply