రీల్స్ అనేది ఇవాళ్టి యువతరంలో ఓ పెద్ద వ్యసంగా మారిపోతోంది.
రీల్స్ చేసే మోజులో యువతీయువకులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతూ ఉండడం ప్రాణాలు కోల్పోతుండడం మనం అనేక వార్తల్లో గమనిస్తుంటాం. కానీ.. రీల్స్ వలన వచ్చిన ఆగ్రహం ఒక హత్యకు కూడా దారితీసిన సంఘటన ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని, ఆరునెలలు కూడా గడవక ముందే భర్త హత్య చేశాడు. కారణమేంటంటే.. ఇంట్లో ఉన్నంతసేపూ నిరంతరం రీల్స్ చూస్తూనే ఉంటుందని.. ఎంత చెప్పినా వినకపోవడంతో కోపమొచ్చి చంపేశానని పోలీసులకు చెప్పాడు.
రీల్స్ అనేవి యువతను ఎన్ని రకాలుగా నాశనం చేస్తుంటాయో చాలా మంది చెబుతుంటారు. చివరకు హత్యలకు కూడా కారణమవుతున్నాయని ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది.
.