ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త మాట పుడుతుంది.. వివాదంగా మారుతుంది. కొందరికి అస్త్రం అవుతుంది.. మరి కొందరిని భస్మం చేస్తుంది. అప్పటిదాకా ఉన్న సమస్యలు అన్నిటినీ ప్రజలు మర్చిపోయి.. ఆ ఎన్నికలు ముగిసే దాకా ఆ ఒక్కమాట చుట్టూ తిరుగుతారు.. లేదా తిరిగేలా చేస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలకు అలాంటి ‘ఒక్కమాట’ సర్జికల్ స్ట్రైక్స్.
ఆ మాట వాడితే.. ఆ మాట చుట్టూ బీజేపీ క్రెడిట్ తమదే అని చాటుకుంటున్నది గనుక.. తమ పార్టీకి ఇక్కడ ఎన్నికల్లో కూడా ఎడ్వాంటేజీ అవుతుందని భావించారో ఏమో గానీ.. బండి సంజయ్- తమ పాలన వస్తే పాతబస్తీలో సర్జికల్ స్టైక్స్ జరిపిస్తాం అంటూ ఆవేశంగా ప్రకటించారు. పాతబస్తీ అనే పదం వాడడం దాని ద్వారా హిందూ ఓటు బ్యాంకును కూడగట్టుకోవాలనేది ఆయన ఆలోచన కావొచ్చు. కానీ.. అందులో ఆయన ఏ మేరకు సక్సెస్ అయ్యారో గానీ.. వైరిపక్షాలు మాత్రం బాగానే వాడుకుంటున్నాయి.
ఇదీ చదవండి వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు టీఆర్ఎస్ 5 కోట్ల స్కెచ్ టిఆర్ఎస్కు మజ్లిస్ వార్నింగ్ ఏంటో తెలుసా?
కేటీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఈ పాయింటును గట్టిగా పట్టుకున్నారు. బహుశా ఈ ఎన్నికలు ముగిసే దాకా ఈ మాటను వారు మర్చిపోరు. పదేపదే అంటూ.. బీజేపీని ఆత్మరక్షణలో పడేస్తారు.
హైదరాబాదులో మత కలహాలకు ప్లాన్ చేస్తున్నారా? నగరాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? ప్రజలు ఎవ్వరూ భయపడే పనిలేదు. హైదరాబాదులో అల్లర్లేమీ జరగకుండా మేం చూసుకుంటాం తరహా డైలాగులతో తటస్థవాదులందరినీ ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కేటీఆర్.
అదే సమయంలో ఒవైసీ దూకుడు ఇంకో విధంగా ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ అనే మాట తమను ఉద్దేశించి అన్నదే కాబట్టి.. పాతబస్తీ అంటే పాకిస్తాన్ అనుకుంటున్నారా? ఏ రకంగా ఇక్కడ ఆ పని చేస్తారు అంటూ.. ఆయన విరుచుకుపడుతున్నారు. పాతబస్తీలో ఉన్నదంతా భారతీయులే.. భారతీయుల మీదనే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కావాలంటే.. లడాఖ్ లో చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. అంటూ కేంద్రప్రభుత్వపు చేతగానితనాన్ని గుర్తి చేసేలా అసదుద్దీన్ మాట్లాడడం విశేషం.
బండి సంజయ్ వాడిన ‘సర్జికల్ స్ట్రైక్స్’ అనే మాట ఆ పార్టీకి ఎంత మేరకు ప్రచారంలో మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నదో తెలియదు గానీ.. ప్రత్యర్థి పార్టీలు టీఆర్ఎస్, మజ్లిస్ ప్రచారంలో మాత్రం ప్రతిరోజూ వాడే మాటగా తయారైంది. ఈ మాటనుంచి ఎడ్వాంటేజీ తీసుకోవాలని వారు ఫిక్సయిపోయారు. ఇప్పుడు బీజేపీకి గత్యంతరం లేదు. ఆ మాట వారు కూడా వాడాల్సిందే. ఆ మాట వలన మంచో చెడో వారు భరించాల్సిందే. లేదా.. ఇంకా పదేపదే అదే ఆవేశాలను రెచ్చగొడుతూ.. హిందూత్వ ఓటు బ్యాంకును మరింత గట్టిగా సమీకరించి గెలవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందేమో చూడాలి.
.

Discussion about this post