సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లో చిన్న విషయం జరిగినా.. దాన్ని కాకుల్లా పొడిచి పొడిచి చూడడానికి మీడియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందుకే ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు.. కొంతకాలం వరకు పబ్లిక్‌లోకి రాకుండా మీడియాను ఎవాయిడ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ.. చైతూ స్టైలే వేరు.
సమంతతో వైవాహిక బంధం నుంచి విడిపడిన తర్వాత.. అక్కినేని నాగచైతన్య తొలిసారిగా పబ్లిక్ లోకి రానున్నారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఎవరు ఎలా వ్యవహరించినా.. ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్ లోకి రాక తప్పదు. ఆ క్లారిటీ ఉన్నవాడు గనుకనే.. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. డైవోర్స్ అయిన కొన్ని రోజులకే పబ్లిక్ ఫంక్షన్ కి ఎటెండ్ అవుతున్నాడు నాగచైతన్య. తన తమ్ముడు అఖిల్ చేసిన చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రానున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రూపొందింది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు- మరో నిర్మాత, ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 15న విడుదల తేదీని కూడా ప్రకటించారు.
కాగా, శుక్రవారం అక్టోబర్ 8నాడు ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. హైదరాబాదు JRC కన్వెన్షన్ హాల్ ఇందుకు వేదిక. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి.
అధికారిక పోస్టర్ కూడా విడుదల అయింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చేశారు. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేశారని సమాచారం. ట్రైలర్ టాక్ అందుకు తగ్గట్టే ఉంది. యూ ట్యూబ్‌లో ఇప్పటికే 7.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది
.

Discussion about this post