నేను ఈనాడులో పనిచేసేటప్పుడు ఒక న్యూస్ ఎడిటర్ ఉండేవాడు. ఎడిషన్ వేళకు ఆరోజు ఫస్ట్ పేజిలో వాడదగిన వార్తల లిస్టు తీసుకుని ఆయన దగ్గరకు వెళ్లేవాణ్ని. నేనేమో షిఫ్ట్ ఇన్ ఛార్జి గిరీ వెలగబెడుతుండేవాణ్ని.
‘‘ఏమున్నాయి వార్తలు?’’ అని అడిగేవాడాయన. ‘‘దిల్లీ నుంచి ప్రధాని వార్త వచ్చింది. దాన్ని బ్యానర్ చేద్దాం అయిదు కాలాల్లో. బ్యానర్ న్యూస్ కింద మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. బాక్స్ గా వాడదాం. బ్యానర్ పక్కన సింగిల్ కాలమ్ గా మనస్టేట్ న్యూస్.. బాటమ్ లో యాంకర్ స్టోరీగా..’’
నా మాటలు పూర్తికాకముందే ఆ న్యూస్ ఎడిటర్ సంభాషణ మొదలుపెట్టేవాడు.
‘‘చక్రధర్ గారూ! ఇవాళ మనం ఫస్ట్ పేజీని ఎలా ప్లాన్ చేద్దామంటే..’’ అని మొదలుపెట్టి అంతకుముందు నేను చెప్పిన మాటలనే ‘కట్ అండ్ పేస్ట్’ పద్ధతిలో పొల్లు పోకుండా నాకే చెప్పి అలా చేయండని నన్ను ఆదేశించేవాడు. ఫస్ట్ పేజీ వార్తలకు నేను రాసిచ్చిన హెడ్డింగ్స్ ను తన చేతిరాతతో కాపీ చేసి కంపోజ్ చేయించేవాడు.
చాలా పత్రికాఫీసుల్లోనూ ఆ మాటకొస్తే సాఫ్ట్ వేర్ కంపెనీల్లోనూ ఇతరత్రా మనకు ఇలాంటివారు చాలామంది తారసపడుతుంటారు. వీరికి ముఠామేస్త్రీలని ముద్దుగా పేరు పెట్టుకుందాం.
ఈ ముఠామేస్త్రీలు ఏమీ పని చేయరు. చేసే నైపుణ్యాలూ, ప్రావీణ్యాలూ ఎటూ ఉండవు. వాణ్ని పట్టుకుని, వీణ్ని పట్టుకుని కులాలు, ప్రాంతాలను పాచికలుగా ప్రయోగించి మొత్తానికి తమ పొజిషన్ ను సుస్థిరం చేసుకుంటారు.
వీరికి పనేమీ ఉండదు. పని చేయరు. పని చేయించు అని పెద్దబాసు పురమాయిస్తాడు. ముఠామేస్త్రీ అనే మాట మోటుగా ఉందని చెప్పి ఈ మధ్యనే మెరుగుపరిచారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
‘నాయకత్వ నైపుణ్యాలు, సామర్ధ్యాలు’ అనే మాట విస్తృత ప్రచారంలో పెట్టి పబ్బం గడుపుకొస్తున్నారు.
యజమానికి నమ్మిన బంటుగా ఉంటూ మీ జాతకాలు నా చేతిలో ఉన్నాయని కిందివారిని అదిలిస్తూ, బెదిరిస్తూ వీరు రాణిస్తుంటారు. అంచెలంచెలుగా బోర్డు డైరెక్టర్లుగానూ ఎండీలుగానూ ఎదిగి మనల్ని ఉద్ధరిస్తుంటారు.
ఒకప్పుడు పల్లెటూళ్లలో మోతుబరి రైతులు ఉండేవాళ్లు. పొలం గట్టుమీద చెట్టు నీడన నిల్చుని, పొలాల్లో చెమటోడ్చే కూలీలను గదమాయించేవారు. కొండొకచో ప్రేమకొద్దీ యధేచ్ఛగా బూతులూ విరజిమ్మేవారు సంభాషణల్లో.
ఇంతకీ మీ ఆఫీసులో ముఠామేస్త్రీ మాటేమిటి?
బాగానే చెండుకు తింటున్నాడా?
తన నాయకత్వ ‘సామర్ధ్యం’తో వర్క్క కల్చర్ గురించీ డెడికేషన్ గురించీ లెక్చర్లు దంచుతున్నాడా? అవన్నీ విని మీరు తరిస్తున్నారా?
– డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.

Discussion about this post