వెటరన్ అందాలను వెండితెరమీద పంచిపెట్టే విషయంలో యాంకర్ అనసూయ ముందంజలోనే ఉంటారు. అందాలు చిందే ఫోటో షూట్ లతో నిత్యం ఇన్ స్టా వేదికగా లెక్కకు మిక్కిలిగా ఫాలోయర్లతో చెలరేగిపోతూ ఉంటారు. అడపాదడపా సినిమాలలో కూడా మెరుస్తున్నారు. అయితే.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రంలో దాక్షాయణిగా మంచి అవకాశం చేజిక్కించుకున్న అనసూయ ఫస్ట్ లుక్ మాత్రం ఆమె అందాల అభిమానులకు ఇబ్బందికరంగా ఉంది.
అనసూయను వెరైటీగా, అందంగా చూపించడం మీద బాగానే శ్రద్ధ తీసుకున్నారు గానీ.. ఆమె విగ్ విషయంలోనే వచ్చింది చిక్కంతా. అనసూయకు వాడిన విగ్ మరీ గలీజుగా ఉందనే అభిప్రాయం ఫస్ట్ లుక్ చూడగానే కలుగుతుంది. ఆమె డ్రస్, నగలు, అప్పియరెన్స్, లుక్ అన్నింటి మీద శ్రద్ద తీసుకున్నారు గానీ. విగ్ మాత్రం చెత్తగా ఉన్నదని అనుకుంటున్నారు.
డిసెంబరు 17న రిలీజ్ కానున్న ‘పుష్ప: ది రైజ్’ నుంచి దాక్షాయణిగా అనసూయ ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఈ సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే దాక్షాయణిగా అనసూయ పాత్ర బయటకు వచ్చింది.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అనసూయలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు సుకుమార్.. ఇప్పుడు దాక్షాయణిగా మరో కొత్తకోణంలో చూపించబోతున్నారు. పోస్టర్ చూడగానే.. లేడీడాన్ అవతారంలో ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. పైగా సినిమా కూడా ఎర్రచందనం నేపథ్యంలో మాస్, నాటు నేపథ్యానికి చెందినది కావడంతో.. నెగటివ్ షేడ్ పాత్రలాగా ఈ దాక్షాయణి మనకు కనిపిస్తుంది.
నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్ ఇది. మెడలో కంటె, కాసుల పేరు, చేతులకు కడియాలు, గాజులు, వేళ్లనిండా ఉంగరాలు.. ముక్కుకు రెండు బేసరలు, కాటుక కళ్లు, పావలా కాసంత కుంకుమ బొట్టు. సరిగంచు పట్టుచీర.. యివన్నీ అదరగొట్టేలాగానే ఉన్నాయి గానీ.. అనసూయ విగ్ మాత్రం ఘోరంగా ఉంది.
మరోవైపు పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
అందాలు చిందే ఫోటోలతో అభిమానుల్ని అలరించడంలో అనసూయ అనేక చిన్నెలు పోతుంటారు. అలాంటిది.. స్టిల్ ఎలా ఉన్నప్పటికీ.. ఘోరంగా ఉన్న విగ్ మాత్రం తేడా కొట్టేసింది. సినిమాలో ఆ పాత్ర, ఆ విగ్ తో అపియరెన్స్ ఎలా ఉంటుందో గానీ.. ఫస్ట్ లుక్ మాత్రం డిజప్పాయింటింగ్ గానే ఉంది.
అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post