నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు నవంబరు 30, డిసెంబరు 1వ తేదీల్లో జరుగనున్నాయి.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి.
వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
నవంబరు 30న సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరుగనుంది. డిసెంబరు 1న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, రాత్రి పూర్ణాహుతి నిర్వహిస్తారు.
.
Discussion about this post