నారా చంద్రబాబునాయుడును అనుచితమైన పదజాలంతో దూషించడం, కుటుంబసభ్యులను ఉద్దేశించి.. అనుచితమైన, అసభ్యమైన వ్యాఖ్యలు చేయడం.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అత్యంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు అసహ్యించుకునేలా చేసిన సంఘటన. దీనికి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని రీతిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. వెక్కి వెక్కి ఏడ్చారు.
రాష్ట్రంలో రాజకీయంగా చంద్రబాబునాయుడును ద్వేషించే వాళ్లున్నా సరే.. ఇవాళ్టి ఎపిసోడ్ లో ఆయన మీద సానుభూతి చూపించారు. అయ్యో అన్నారు. చంద్రబాబుకు మద్దతు పలికారు. ఆయన కన్నీళ్లు పెట్టి ఉండాల్సింది కాదన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలే అయినా.. ఇవాళ్టి ఎపిసోడ్ వలన ఆయన పట్ల చాలా మందిలో సానుభూతి వచ్చింది. తమ నేతలు తప్పు చేశారని అనుకున్నారు. అయితే ఈ రకమైన ప్రజాస్పందనను కొంత గుర్తించినా, తదనుగుణంగా మౌనం పాటించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఫెయిలయింది.
ఇంతపెద్ద రాద్ధాంతం జరిగిన తర్వాత.. అసలు చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడనే లేదంటూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెనకేసుకొచ్చారు. అదనంగా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి ఇవాళ దక్కిన చెడ్డపేరును మరింత పెంచారు.
also read : మోడీజీ ఈ ఓటమి నుంచి మీరేం నేర్చుకున్నారు..
రోజా.. మరింత అసహ్యించుకునేలా..
ఇవాళ్టి వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి ఉంటే ఇంకోరకంగా ఉండేదేమో. కానీ.. వైసీపీ నాయకులు చంద్రబాబు కన్నీళ్లను కూడా ఎద్దేవా చేస్తూ, ఎగతాళి చేస్తూ ప్రజల్లో వారి పట్ల మరింత ఏహ్య భావం పుట్టేలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు కన్నీళ్లను కూడా ఎగతాళి చేయడం వలన ప్రజలు అలా అంటున్న వైసీపీ నాయకులను మరింతగా అసహ్యించుకుంటున్నారు.
also read : చరిత్రలో అనూహ్య ఘటనలు .. మోడీ వెనక్కి తగ్గడం.. చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం.. చెప్పే పాఠాలేంటి
సినీనటి, ఎమ్మెల్యే రోజా స్టేటస్ గా పెట్టిన ఫోటో- క్యాప్షన్ కూడా అలా వివాదానికి గురవుతోంది. తెలుగుదేశం వారిని మరింత రెచ్చగొట్టేలా ఉంది. రోజా తీరును తటస్థులు కూడా అసహ్యించుకునేలా ఉంది.
రోజా నోటిదూకుడుకు, హద్దూ అదుపూ లేకుండా మాట్లాడడానికి పేరుమోసిన మహిళా నేత. అసెంబ్లీలో బూతులు మాట్లాడి.. పదవీకాలం పూర్తయ్యేవరకు నిషేధానికి గురైన ఎమ్మెల్యే. అలాంటి రోజా నుంచి ఇంతకంటె సంస్కారమైన, విలువైన స్టేటస్ లు ఆశించడం కూడా తప్పే అవుతుందేమో.
అయితే.. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను చూపిస్తూ.. ‘‘నేను ఎప్పుడో చెప్పాను.. నా అల్లుడు నాకంటె పెద్ద నటుడు అని..’’ అని ఎన్టీ రామారావు వ్యాఖ్యానిస్తున్నట్లు రోజా తన స్టేటస్ లో పెట్టారు. రోజా వ్యాఖ్యలు, వెటకారాలు వైసీపీ పరువును గౌరవాన్ని మరింత దిగజార్చేలా ఉన్నాయి.
.