శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి బియ్యపు బుధవారం నాడు వరద బాధితులకు బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
తొట్టంబేడు మండలం, బసవయ్యపాలెం లోని దిగువ మరియు ఎగువ యాానాది సెంటర్ వాసులకు 5 కేజీలు బియ్యం, ఒక కేజీ కందిపప్పు, గుడ్లు, ఉల్లిపాయలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం వర్షాలకు దెబ్బ తిన్న ఇళ్లను పరిశీలించారు.
మీ సమస్యలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారిస్తాం అని బాధితులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
.