అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటగిరినాధుని ఆభరణాల ఖజానాలో మరో అమూల్యమైన నగలు వచ్చి కొలువు తీరాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు.
వజ్రాలు మరియు కెంపులు పొదిగిన ఈ ఆభరణాల బరువు దాదాపు 5.3 కిలోలు.
ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.
వీటిని ప్రత్యేక అలంకరణ రోజుల్లో తిరుమల శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరిస్తారు.
.

Discussion about this post