శేఖర్ కమ్ముల హేపీడేస్ తో ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం వంటి హిట్ తో యువతరం కలల హీరోగా ముద్రపడిన వరుణ్ సందేశ్ ను వెండితెరపై మీరు చూసి ఎన్నాళ్లయింది? ఆలోచిస్తున్నారా? చాలాకాలామే అయిఉంటుంది లెండి. ఆయన సినిమా చేసే చాలా సంవత్సరాలు అయిపోయింది.
రీఎంట్రీ తరహాలో ఇప్పుడు ‘ఇందువదన’ చేస్తున్నారు. బ్యూటిఫుల్ టైటిల్ తో లేడీఓరియెంటెడ్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తోంది ఈ చిత్రం.
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR (ఎం శ్రీనివాసరాజు) దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్.
విడుదలైన క్షణం నుంచే కంటెంట్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.
.

Discussion about this post