తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం జరుగుతోంది.
2022 జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్‌స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయర్‌స్వామి, ఇతర పండితులు పాల్గొన్నారు.
.

Discussion about this post