భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున సాగు భూములు పంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుచ్చినాయుడు కండ్రిగ మండలం కార్ణమిట్ట దళిత వాడలో సీపీఐ శాఖ సమావేశం చెరువు వీరాస్వామి అధ్యక్షత న జరిగింది .
ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానికి తోడుగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలకు మరింత భారాన్ని మోపారని తీవ్రంగా విమర్శించారు .
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు , గిరిజనులు , మహిళలపై దాడులు హత్యలు , అవమానాలు కొనసాగుతున్నాయని దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా మనువాద సిద్ధాంతాన్ని అమలుపరుస్తున్న మోడీపై తిరగబడాలి అని పిలుపు నిచ్చారు .
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తోన్నాడని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఒకటిన్నర సెంట్లు స్థలం సరిపోదని తప్పకుండా మూడు సెంట్లు ఇంటిస్థలం మంజూరు చేసి దళితులను గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .
డిసెంబర్ 26వ తారీఖున సిపిఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి శాఖలో ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు . ఏరియా కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ కార్ణమిట్ట లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రతి దళితుడికి పంచాలని లేకుంటే భూమిలో ఎర్ర జెండాలు నాటి పేదలందరికీ సిపిఐ నాయకత్వన పంచుతామని హెచ్చరించారు.
కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 26వ తారీఖున పండుగ వాతావరణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు . ఈ సమావేశంలో చెరువు వీరాస్వామి , చొక్క లింగం , చెంగయ్య , సురేష్ సుబ్రహ్మణ్యం , మదు , మహేష్ తదితరులు పాల్గొన్నారు .
.

Discussion about this post