సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న రమేష్ బాబు.. శనివారం నాడు పరిస్థితి విషమం కావడంతో ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి.. ఆస్పత్రికి తరలిస్తుండగానే,.. మార్గమధ్యంలో మరణించారు.
ఘట్టమనేని రమేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు! సినిమారంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. చాలా కాలం పాటు సినిమా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సోలో హీరోగా చాలా చాలా ప్రయోగాత్మక యాక్షన్ చిత్రాలు చేశారు.
చివరికి నిర్మాతగా, స్టుడియో యజమానిగానే స్థిరపడ్డారు. పెద్దగా వార్తల్లో నిలిచే వ్యక్తిగా కాకుండా.. కేవలం పద్మాలయ బ్యానర్ అధినేతగానే ఆయన ఉండిపోయారు.
సూపర్ స్టార్ కృష్ణ కాలం నుంచి ఆయనతో కలిసి సినిమాల్లో నటించడంతోనే.. తన నట ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన రమేష్ బాబు పలుచిత్రాలు చేశారు.
.