ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్యాయం చేసే రివర్స్ పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య డిమాండు చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం శ్రీకాళహస్తి తహసీల్దారు కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా గురవయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయులకు రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశారు.
మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నరు. అనంతరం తహసీల్దారు జరీనాబేగం కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు శివకుమార్,గోపి, శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వెంకటేష్, హరినాథ్, జాన్ ,మోహన్, సిద్దయ్య, శ్రీనివాసులు, రెడ్డి సీనయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
.