ప్రభుత్వ పథకాలకు ప్రజలకు సక్రమంగా చేరవేస్తున్నారా లేదా అన్న విషయంలో వాలంటీర్ల కృషి ఎంతో అభినందనీయం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పధకాలను ప్రతిఒక్కరి ఇంటికి అందిస్తున్నారు.
అదేవిధంగా కరోనాను కూడా లెక్క చేయకుండా పనిచేస్తూ తమ నిబద్ధతను చాటుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని జెట్టిపాలెం కు చెందిన పి . శ్రీనివాసులు (59) తిరుపతిలోని స్విమ్స్ లో డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నాడు. దీన్ని గమనించిన వాలంటీర్లు సినిమావీధి -02 వెల్ఫేర్ సెక్రటరీ రాజశేఖర్ కు సమాచారం అందించారు.
దీంతో ఆయనకు ప్రభుత్వం నుండి తొలిసారి మంజూరు అయిన సికెడియు పింఛన్ నగదు రూ . 10,000/- ను తిరుపతికి వెళ్లి అందించారు .
ఈ సందర్భంగా శ్రీనివాసులు వాలంటీర్లను అభినందించారు. కార్యక్రమంలో సినిమావీధి -02 వెల్ఫేర్ సెక్రటరీ రాజశేఖర్ తో పాటు వాలంటీర్లు కిరణ్ కుమార్ , సద్దాం , భరత్ గుప్తా తదితరులు ఉన్నారు.
.