చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు సభ్యుల గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పుత్తూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పుత్తూరు డిఎస్పీ యశ్వంత్ తెలిపిన వివరాలు తెలియచేశారు.
పిచ్చాటూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా విక్రయం గురించి అందిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కీళ్ళపూడి బస్టాప్ ఎదురుగా ఆంజనేయస్వామి గుడి వెనుక గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా గూడూరు కు చెందిన పాదర్తి వెంకటేష్ (32), చిత్తూరుజిల్లా రేణిగుంటకు చెందిన ఎన్.సుధీర్ (23), నారాయణవనం కు చెందిన యం. ఉదయ్ కుమార్ (23), ఏ. కిరణ్(20), అదే మండలం వెంకట కృష్ణం పాలెం గ్రామానికి కు చెందిన జే.చిన్నబ్బ (51), జే. చిరంజీవులు (34) లను అరెస్టు చేసి వారి నుండి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కాగా ముఠా లోని పాదర్తి వెంకటేష్ విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో గంజాయిని సేకరించి ఇక్కడకు తీసుకొచ్చి జిల్లాలోని
పుత్తూరు, నారాయణవనం, రేణిగుంట తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రేతలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ ఐ దయానిధినాయుడు సిబ్బంది పాల్గొన్నారు.
.