పరిశ్రమల శాఖా మాత్యులు మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం తీరని లోటు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తొట్టంబేడు మండల టీడీపీ అధ్యక్షులు గాలి మురళీనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు వారు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అతి చిన్నవయసులోనే మంచి రాజకీయ వేత్తగా గుర్తింపు పొంది… ఇలా అకాల మరణం పొందడం బాధాకరమన్నారు.
గౌతంరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అదేవిధంగా గౌతంరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యునిగా 2014, 2019 ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలుపొంది… రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మాత్యులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి… వివాదరహితుడిగా, సౌమ్యుడిగా ప్రజల మన్ననలు పొందార్నారు.
.