ఉపాధి హామీ పథకం కు బడ్జెట్ లో 2.40 వేల కోట్ల రూపాయలు కేటాయించాలి !
కొత్త వీరా పురం సచివాలయం వద్ద ధర్నా !
ఏ పి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ను సక్రమంగా అమలు చేయాలని , అందుకు అవసరమైన నిధులు 2.40 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు .
మంగళవారం ఏర్పేడు మండలం కొత్త వీరపురం , కందాడు గ్రామపంచాయితీ కార్యదర్శులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా కొత్త వీరాపురం సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు .
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానీ కి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించక పోగా ఆ పథకానికి తూట్లు పొడవడం , నిర్వీర్యం చేయడం గ్రామీణ పేదలకు ద్రోహం చేయడమేనని తీవ్రంగా విమర్శించారు .
గత ఏడాది విడుదల చేసిన బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం బడ్జెట్ లో 27 శాతం తగ్గించడం అన్యాయం అన్నారు . ఉపాధి హామీ పనులు రెండు పూటల చేయించే ఆలోచన మానుకోవాలని , సమ్మర్ అలేవెన్స్ లు అమలు చేయాలని డిమాండ్ చేశారు .
అనంతరం సచివాలయం కార్యదర్శుల కు వినతి పత్రం అందజేశారు .
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీకాళహస్తి ఏరియా అధ్యక్ష , కార్యదర్శులు జె తులసీ రాజన్ , మించల శివ కుమార్ , తొట్టంబేడు మండల కార్యదర్శి రద్రపాకు శ్రీనివాసులు , ఎం . మీరన్ భాష , రమణయ్య , మహిళలు తదితరులు పాల్గొన్నారు .
.