మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎస్టీయూ శ్రీకాళహస్తి డివిజన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పెండ్లి మండపం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధనతో పాటు సామాజిక సేవలో ఎస్టీయూ ముందుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సి.పి.ఐ.పార్టీ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య, ఎస్టీయూ రాష్ట్ర నాయకులు యువశ్రీ మురళి,డివిజన్ కన్వీనర్ గుమ్మడి మురళి,కన్నయ్య,మోహన్ బాబు,చంద్రయ్య, కోమల,గజేంద్ర,చేమూరు రవి ,రామకృష్ణయ్య, జయప్రకాష్,స్టాలిన్,శివ తదితరులు పాల్గొన్నారు.
.