శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నూతన అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులును మంగళవారం శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతర కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
పూలమాల వేసి దుశ్శాలువతో సత్కరించి… శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభ్యలు మాట్లడుతూ… అంజూరు తారక శ్రీనివాసులు ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా నియమించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తమకు పెద్ద పండుగలా ఉందని వారు అభిప్రాయ పడ్డారు. ఇందుకు కృషి చేసిన శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడుగంగమ్మల ఆలయం పునర్నిర్మాణం చేయాలని కోరారు.
ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డితో చర్చించి తగు నిర్ణయం తీసకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడు గంగమ్మ జాతర కమిటీ సభ్యులు స్వర్ణమూర్తి, సెన్నీరు కుప్పం శేఖర్, మొగరాల గణేష్, కోళ్ల హరినాథ్, ముత్యాల వెంకట కృష్ణ, పాలమంగళం సురేష్ గురుకుల్ రవి, శంకర్, ఉత్తరాజి శరవణ, జలకం కిషోర్, పసల కుమార్ స్వామి, గురుమూర్తి నరసింహులు, బాలా గౌడ్, ధన, షఫీ, కళ్యాణ్, ప్రసాద్, రవి, కిరణ్, రవి, ప్రభాకర్, బుగ్గ హరి, తదితరులు పాల్గొన్నారు.
.