కేంద్ర ప్రభుత్వ కార్మిక ,ఉద్యోగ వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక,ఉద్యోగ సంఘాలు చేయ తలపెట్టిన రెండు రోజుల సమ్మె లో భాగంగా మొదటి రోజైన మార్చి 28 న శ్రీ కాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణ లో ఏర్పాటు చేసిన శిబిరము నందు NFPE, FNPO మరియు AIGDSU శ్రీ కాళహస్తి బ్రాంచ్ అధ్యక్షులు మరియు కార్యదర్శులు ఆధ్వర్యంలో సమ్మె ను విజయవంతంగా కొనసాగించారు,
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు కేంద్రం ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల ను మానుకోవాలని, ప్రైవేటైజేషన్ కు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని నిందించారు,
ఇదే విధంగా రెండవరోజు సమ్మె ను జయప్రదం చేసి కార్మికుల, కార్మిక సంఘాల ఐక్యత ను తెలియజేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ను, ప్రైవేటైజేషన్ ను అడ్డుకుని ప్రభుత్వ సంస్థల ఉనికిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసారు.
.