రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. అధికారుల వాహనాలను అడ్డుకున్నారు
దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటాయి అన్నారు.
నేడు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో సామాన్యుడిపై పెనుభారం పడిందన్నారు. విద్యుత్.చార్జీలు అధికంగా చెల్లించే వారికి ప్రభుత్వ పథకాలు తీసువేస్తామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది అన్నారు.
పెరిగిన విద్యుత్ చార్జీలతో మధ్యతరగతి వ్యక్తులు ప్రభుత్వ పథకాలకు దూరం కాక తప్పదు అన్నారు . పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం తగ్గించని పక్షంలో పోరాటాలు తీవ్రతరం చేస్తామని జగన్ కి సీఎం జగన్ కి బషీర్బాగ్ ఉద్యమాన్ని మృతి చూపిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జనార్దన్, మురళి, పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాథ్, ప్రజా సంఘాల నాయకులు కుమార్ రెడ్డి, రాదా కృష్ణా, రవి, శివ, పద్మనాభ రెడ్డి, మని, శ్రీనివాసులు, రామచంద్రయ్య, ఉదయ్, వెంకీ, రామకృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
.