విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు వనజ సూచించారు.
ఈ మేరకు ఆమె గురువారం శ్రీకాళహస్తి విద్యుత్ నియంత్రికలను సరి చేయు కార్యాలయం, విద్యుత్ ఉప కేంద్రాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాలను పరిశీలించారు. సిబ్బందికి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు సూచనలను చేశారు. విద్యుత్ సరఫరాలో నష్టాలను తగ్గించుటకు తగు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాసు రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంజున్దేశ్వర, సతీష్ బాబు,అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
.