శ్రీకాళహస్తి విద్యుత్ డివిజను పరిధిలో రెండవ శనివారం పురస్కరించుకుని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నట్లు ఆశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాసురెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల మరమ్మతు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
శ్రీకాళహస్తి అర్బన్, శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ, ఏర్పేడు, కేవీబీపురం మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు ఇది గమనించి సహకరించాలని కోరారు.
.