వైసీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనరు, ఆప్కో మాజీ డైరెక్టరు మిద్దెల హరి అండగా ఉంటామని వైసీసీ పట్టణ మాజీ అధ్యక్షులు కొట్టెడి మధు చెప్పారు. మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లిమండపం వద్ద జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు నిర్వహించారు.
పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొట్టెడి మధు మాట్లాడుతూ… శ్రీకాళహస్తిలో వైసీపీ అభివృద్ధి కోసం మిద్దెల హరి ఎంతో కృషి చేశారన్నారు. అయితే స్థానిక నాయకత్వం కారణంగా మిద్దెల హరికి అన్యాయం జరుగుతోందన్నారు.
కార్యకర్తలకు అండగా నియోజవర్గం లోనే కాక జిల్లాలోనే పోరాడిన బీసీ నాయకుడు ఒకే ఒక్కడు మిద్దెల హరి అన్నారు. నేడు పార్టీ లో అతనికి న్యాయం జరగక పోవడం నాయకత్వ తప్పిదమన్నారు. ఆయనకు అందరం అండగా ఉంటామన్నారు.
అనంతరం మిద్దెల హరి మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలేను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదర్శంగా తీసుకొని.. ఆయన జయంతి నాడు బడుగు బలహీన వర్గాలు, దళితులకు మైనారిటీలకు 70% మంత్రివర్గంలో స్థానం కల్పించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
బీసీ లంటే వెన్ను చూపి పారిపోయేవారు కాదని… రొమ్ము చూపి పోరాటం చేసే వారని నిరూపిస్తామన్నారు. వెంకటగిరి బస్టాండ్ రెండు వంతెనల మధ్య జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బార్ కౌన్సిల్ సెక్రటరీ సురేంద్ర ముదిరాజ్, న్యాయవాదులు అంకయ్య, రమణయ్య, వైసీపీ నాయకులు సుందర రామిరెడ్డి, యతిరాజులు, సతీష్, నున్న సుధా, ఇసుక మట్ల బాల, దావాల గిరి, చెన్నయ్య, ప్రభాకర్, ధన, వెంకటయ్య, విజయమ్మ, బాబు, వెంకటేష్, గాంధీ, జగ్గా, చాట్ల శివ, శీను, డి.కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.
.