ప్రజల కోసం ధైర్యంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలో బుధవారం టీడీపీ బీసీ సెల్ నాయకులు రుద్ర ఆయన్ను కలసి రాయచోటి జిల్లా టీడీపీ పరిస్థితులను వివరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యకర్తలను సిద్ధం చేయాలని సూచించారు.
జగన్ ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. నిత్యావసర సరులు ధరలు పెరిగి పోతున్నాయని.. విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని చెప్పారు. వీటి గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.
టీడీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ కోరారు. అవసరమైతే తాను ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రుద్రగోపి మాట్లాడుతూ.. టీడీపీ అభివృద్ధికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని లోకేష్ కు వివరించారు.
.